హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రేపటి నుంచి రెండో దశ వరద సహాయాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. సాయం అందని బాధితులందరికీ రేపటి నుంచి నగదు అందిస్తామన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని... కానీ ప్రతిపక్షాలకు అవి కనిపించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వంపై భాజపా చేస్తున్న ఆరోపణలకు దుబ్బాక ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్తాయని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రజలను భాజపా నాయకులు రెచ్చగొట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని... దీనిని తెరాస ఎప్పటికప్పుడు తిప్పి కొడుతుందని దానం స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు