కరోనా వైరస్ను నియంత్రించే క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 200 మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం రూ. 200 నగదును అందజేశారు. కార్యక్రమంలో అధికారులు ఆర్డీఓ , ఎమ్మార్వో సహా పార్టీ నేతలు మన్నె కవితారెడ్డి , సంతోష్ గుప్త , శివంత్ రెడ్డి , కాజ సూర్య , బల్దియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు