Khairatabad Ganesh 2023 : వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి సమయం ఆసన్న కావడంతో గణనాథుడి తయారీలో ఉత్సవ సమితి వేగం పెంచింది. 68 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ.. ఈసారి 63 అడుగల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తోంది. ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచన మేరకు ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని శ్రీ దశమహా విద్యాగణపతి(Sri Dasha Maha Vidya Ganapathi 2023) రూపంలో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
63 Feet Khairatabad Ganesh Idol 2023 : 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో 10 చేతులు, 7 తలల పడగల కాలనాగుపై నిలబడి భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నారు. గణపతికి ఎడమవైపు సరస్వతీదేవి, కుడివైపు వరాహ లక్ష్మిస్వామిలు కొలువుదీరి ఉంటారు. అలాగే గణపతి వెనుకవైపు తెల్లని పుస్తకం, దానిపై సంస్కృత శోకాలు కనిపించేలా విద్యాగణపతిని ముస్తాబు చేస్తున్నారు. విద్యాగణపతితో పాటు కుడివైపు 15 అడుగుల ఎత్తుతో పంచముఖ లక్ష్మీనరసింహస్వామి, ఎడమవైపున అంతే ఎత్తుతో వీరభద్రస్వామిల ప్రతిమలను సిద్ధం చేస్తున్నారు.
Ganesh Chaturthi Hyderabad 2023 : 37 ఏళ్లుగా గణపతిని చూడమచ్చటగా తయారు చేస్తున్న ప్రధాన శిల్పి రాజేంద్రన్(Shilpi Rajendran) ఆధ్వర్యంలో.. సుమారు 150 మంది కళాకారులు, నిపుణులు నిరంతరం పనిచేస్తున్నారు. విగ్రహ తయారీ కోసం నర్సాపూర్ నుంచి 18 టన్నుల సర్వి కర్రలు, 23 టన్నుల స్టీలు, రాజస్థాన్ నుంచి 50 కిలోల బరువు గల 1200 సంచుల బంకమట్టి, ఏలూరు నుంచి 5 బండిళ్ల జనపనార పౌడరు, యాదగిరిగుట్ట వీరపల్లి నుంచి 50 బండిళ్ల వరిగడ్డిని తెప్పించారు. సుమారు రూ.కోటి విలువైన సామాగ్రితో ఖైరతాబాద్ మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి ఏర్పాట్ల పనులు ముమ్మరం : ప్రస్తుతం రంగులద్దే పని జోరుగా జరుగుతోంది. ఈ నెల 16 వరకు పనులన్ని పూర్తి చేసి.. 18 నుంచి ఖైరతాబాద్ మహాగణపతిని భక్తులకు దర్శనం ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాగణపతి చుట్టుపక్కల పరిసరాలను ఉత్సవాలకు అనుగుణంగా పరిశుభ్రం చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శించుకునేలా ముస్తాబు చేస్తున్నారు.
ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి : అయితే గత 40 ఏళ్లుగా ఉత్సవ కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన సింగరి సుదర్శన్(Singari Sudarshan) ఇటీవల మరణించడం పట్ల ఉత్సవ కమిటీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రతి ఏటా మహాగణపతికి నేత్రాలను సుదర్శనే దిద్దేవారు. ఆయన లేకపోవడంతో ఆ బాధ్యతను శిల్పి రాజేంద్రనే చేస్తారని ఉత్సవ సమితి సభ్యులు(Utsava Samithi Members) చెబుతున్నారు. మరోవైపు రెండేళ్ల నుంచి పూర్తిగా మట్టితోనే మహాగణపతి రూపాన్ని తీర్చిదిద్దుతున్నామని, భక్తుల అభీష్టం మేరకు శోభాయాత్రగా బయల్దేరి సాగరంలోనే నిమజ్జన ప్రక్రియ ఉంటుందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కన్వినర్ సందీప్ రాజు తెలిపారు. నిర్మాణ దశలో మెరుగులు దిద్దుకుంటోన్న శ్రీ దశమహా విద్యాగణపతిని చూసేందుకు భక్తులు రాక మొదలైంది. దీంతో ఖైరతాబాద్ పరిసరాల్లో సందడి నెలకొంది.
Khairtabad Ganesh Height 2023 : ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ ఎత్తు ఎంతో తెలుసా..?