ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణమే లక్ష్యానికి ఉచిత మెగా వైద్య శిబిరాలు తోడ్పడుతాయని ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైద్యసేవలు చేరువయ్యేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కారించుకుని బ్రైట్ వెల్పేర్ అసోసియేషన్, గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని విజయారెడ్డి ఆమె ప్రారంభించారు
ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్న రెండో దశ కరోనాతో ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏసీపీ, కార్పొరేటర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ ధనాధన్.. రచ్చ రచ్చకు వేళాయే!