ETV Bharat / state

Cm Kcr on Paddy Purchase: 'ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరేంటో తెలుసుకుందాం' - Kcr news

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరి ఏంటో తెలుసుకోవాలని (Cm Kcr on Paddy Purchase), ఆ విషయం తేల్చుకున్నాకే... ఇతర అంశాలపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు, సీతారామ, ఇతర ప్రాజెక్టులకు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతుల విషయమై జల్‌శక్తి, పర్యావరణ శాఖల అధికారులను కలిసి వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని ఎంపీలకు ఆయన సూచించారు.

Kcr
Kcr
author img

By

Published : Nov 23, 2021, 5:15 AM IST

ధాన్యం కొనుగోలు(Paddy Purchase)పై కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రంలోని భాజపా (Bjp) పరస్పరం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో తొలుత ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ (Piyush Goel) గోయల్‌ను రాష్ట్ర మంత్రులు కలిసి.. సమగ్రంగా వివరించాలి. మంత్రి స్పందన తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దామని... (Cm Kcr on Paddy Purchase) ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. దిల్లీలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా శాఖల అధికారులను కలిసి వారు లేవనెత్తే సందేహాలను నివృత్తి చేయాలని.... సీఎం సూచించారు. ఇవాళ మధ్యాహ్నం పీయూష్‌ గోయల్‌ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌, లోక్‌సభా పక్షనేత నామానాగేశ్వరరావు, ఎంపీలు కలవనున్నారు.

తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని... కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండేకు... రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. పాండేను కృషి భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు కలిశారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో దిగుబడి రావడం సహా.... రైతుల ఇబ్బందులను వారు వివరించినట్లు తెలిసింది. పాలమూరు-రంగారెడ్డితో పాటు సీతారామ మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరిరామ్‌, ఓఎస్డీ శ్రీధర్‌రావు పాండే ఇతర అధికారులు జల్‌శక్తి, పర్యావరణ శాఖ అధికారులను కలవనున్నారు.

ఇవీ చదవండి: Local body MLC Elections Telangana: నిజామాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేయనున్న కవిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.