ETV Bharat / state

20 ఏళ్ల అనుబంధం ముగిసిన వేళ - తుగ్లక్‌ రోడ్‌ నివాసాన్ని ఖాళీ చేయనున్న కేసీఆర్ - KCR To Move Out From Delhi Residence

KCR To Vacate Delhi Residence : తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కవిత కూడా ప్రస్తుతం ఎంపీ పదవిలో లేదు. దీంతో దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటిని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. రెండు మూడు రోజులు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు బీఆర్ఎస్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది.

Kcr To Vacate His Official Residence in Delhi
KCR To Vacate Delhi Residence
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 2:01 PM IST

KCR To Vacate Delhi Residence : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుండటంతో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలు ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలు ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోని తమ సామగ్రిని షిప్ట్ చేస్తున్నారు.

Telangana Assembly Election Results 2023 : ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తుగ్లక్‌ రోడ్‌లో ఉన్న అధికార నివాసంతో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు 20 ఏళ్ల అనుబంధం తెగిపోయింది. ఆయన 2004లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తరపున కరీంనగర్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్‌.. మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను ప్రభుత్వం కేటాయించింది.

కేసీఆర్ హ్యాట్రిక్​ విన్​కు బ్రేక్ - తెలంగాణలో కారు పంక్చర్ కావడానికి కారణాలేంటి?

KCR To Move Out From Delhi Residence : కేసీఆర్‌ 2006లో తన కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో వచ్చిన ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా విజయం సాధించి అదే నివాసాన్ని ఎంచుకున్నారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్స్​లో ఉన్నారు. 2014 తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్‌ కుమార్తె కవిత అదే ఇంటిని తన అధికారిక నివాసంగా ఎంచుకోవడంతో అలా ఆ నివాసం ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్‌ రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక అక్కడే ఉన్నారు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. కవిత కూడా ప్రస్తుతం ఎంపీ పదవిలో లేరు. ఈ క్రమంలో దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంటిని ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా రెండు మూడు రోజులు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు బీఆర్ఎస్ వర్గాలు నివేదించినట్లు తెలిసింది.

CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్ తమిళిసై ఆమోదం

Gajwel, Telangana Assembly Election Result 2023 Live : గజ్వేల్​లో కేసీఆర్​ ముందంజ - ఏడు రౌండ్ల వివరాలు ఇవే

కామారెడ్డిలో కేసీఆర్​ ఓటమి - అసలు కారణం వాళ్లేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.