గ్రామస్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ ఎంతగానో తపన పడ్డారని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. పంచాయతీ వ్యవస్థ అనేది ఒక విభాగం కాదు.. ఉద్యమమని సీఎం స్పష్టంచేశారు. అవినీతిరహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ చట్టంలో
పేదల కోసం మరిన్ని పౌర సదుపాయాలు కల్పించామన్నారు. పట్టణాల్లో పేదలు 75 గజాల లోపు జీప్లస్ 1 ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరంలేదని తీపి కబురు చెప్పారు. అలాగే జీ ప్లస్ 1 వరకు రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్క రూపాయిగా నిర్ణయించినట్లు తెలిపారు. 75 గజాలలోపు నిర్మించుకున్న ఇంటికి పన్ను ఏడాదికి రూ.100 మాత్రమే అని సీఎం పేర్కొన్నారు.
ఇవీ చూడండి:'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం'