ETV Bharat / state

పూర్తి స్థాయిలో బస్సులు నడపండి: సీఎం

సమ్మె , బంద్ పిలుపు నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపితే ఇబ్బంది లేదని.. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

పూర్తి స్థాయిలో బస్సులు నడపండి: సీఎం
author img

By

Published : Oct 19, 2019, 5:12 AM IST

పూర్తి స్థాయిలో బస్సులు నడపండి: సీఎం

ఆర్టీసీ సమ్మె నేడు 15 రోజులకు చేరుకుంది. ఇవాళ ఐకాస రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చింది. రాష్ట్ర బంద్ పిలుపు నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై సీఎం కేసీఆర్ ​ సమీక్షించారు. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టులో జరిగిన వాదనలు, కోర్టు సూచనలను అధికారులు, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్​ రావులు సీఎం కేసీఆర్​కు వివరించారు. కోర్టు ఉత్తర్వులు శనివారం అందుతాయని చెప్పారు. దీనితో చర్చల విషయమై ఎలాంటి స్పష్టతకు రాలేదని సమాచారం.

అవసరమైన చర్యలు:

సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఆర్టీసీ బస్సులను యథాతథంగా నడపాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ బస్సులను నడిపేలా చూడాలని స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపితే ఇబ్బంది లేదని.. ఎవరైనా ఆటంకాలు కలిగించినా, చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. బస్ స్టేషన్లు, డిపోల వద్ద పోలీసు బలగాలను అందుబాటులో ఉంచడం, నడిచే బస్సులకు రక్షణ సహా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వీలైనన్ని బస్సలు:

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా, ఆర్టీసీ అధికారులతో మంత్రి అజయ్ సమీక్ష నిర్వహించారు. వీలైనన్ని ఎక్కువ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు తీర్పు ప్రతి అందడంతో పాటు ఇతర పరిణామాల అధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి : చరిత్రే చిన్నబోతోంది... ఆ రణభూమికి ఇప్పుడేమైంది!?

File : TG_Hyd_07_19_Govt_Pkg_3053262 From : Raghu vardhan ( ) సమ్మె , బంద్ పిలుపు నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. శాంతియుతంగా నిరసనలు తెలిపితే ఇబ్బంది లేదు కానీ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అటు చర్చల వ్యవహారంపై ఇంకా ఏమీ తేల్చలేదు...లుక్ వాయిస్ ఓవర్ - ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో ఐకాస నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టులో జరిగిన వాదనలు, కోర్టు సూచనలను అధికారులు, అదనపు అడ్వకేట్ జనరల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. కోర్టు ఉత్తర్వులు శనివారం అందుతాయని చెప్పారు. దీంతో చర్చల విషయమై ఎలాంటి స్పష్టతకు రాలేదని సమాచారం. తీర్పు కాపీ అందాక అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంద్ పిలుపు నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై మంత్రి పువ్వడ అజయ్, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఆర్టీసీ బస్సులను యథాతథంగా నడపాలని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ బస్సులను నడిపేలా చూడాలని స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపితే ఇబ్బంది లేదని, ఎవరైనా ఆటంకాలు కలిగించినా, చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్ స్టేషన్లు, డిపోల వద్ద పోలీసు బలగాలను అందుబాటులో ఉంచడంతో పాటు నడిచే బస్సులకు రక్షణ సహా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా, ఆర్టీసీ అధికారులతో మంత్రి అజయ్ సమీక్ష నిర్వహించారు. వీలైనన్ని ఎక్కువ బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు తీర్పు ప్రతి అందడంతో పాటు ఇతర పరిణామాల అధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.