ETV Bharat / state

సామాన్యుడి కోసం కారు దిగొచ్చిన సీఎం కేసీఆర్​

author img

By

Published : Feb 27, 2020, 7:40 PM IST

Updated : Feb 27, 2020, 11:28 PM IST

kcr met common man
సీఎం కేసీఆర్‌ ఔదార్యం

19:33 February 27

సీఎం కేసీఆర్‌ ఔదార్యం

సీఎం కేసీఆర్‌ ఔదార్యం

    ముఖ్యమంత్రి కేసీఆర్​ మరోసారి తమ ఔదార్యం చాటారు. దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను ఆలకించిన సీఎం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్​లోని టోలీచౌకిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన సీఎంకు.. మార్గమధ్యలో ఓ దివ్యాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు.  

     వెంటనే కారు దిగిన కేసీఆర్... ఆ వృద్ధుని సమస్యలు తెలుసుకున్నారు. గతంలో డ్రైవర్​గా పనిచేసిన తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, నాలుగేళ్ల క్రితం భవనంపై నుంచి పడడం వల్ల కాలు విరిగిందని మహ్మద్ సలీం సీఎంకు వివరించారు. తన కుమారుని ఆరోగ్యం బాగా లేదని, ఉండేందుకు కూడా ఇళ్లు లేదన్న సలీం... తగిన సాయం చేయాలని ముఖ్యమంత్రిని వేడుకున్నారు.

   సలీం పరిస్థితిపై స్పందించిన కేసీఆర్...  సమస్యలను పరిష్కరించి దివ్యాంగుల ఫించను, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు  సలీం ఉంటున్న ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్.. విచారణ జరిపారు. సలీం దివ్యాంగుడని నిర్ధారించే సదరం ధ్రువపత్రం ఉండడం వల్ల అక్కడే ఫించన్​తోపాటు  జియాగూడలో రెండు పడకల గదుల ఇళ్లును మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధ పడుతున్న సలీం కుమారునికి  ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందిస్తామని పాలనాధికారి తెలిపారు.  

ఇదీ చదవండి: ఆ వాట్సాప్​ గ్రూపుల్లోనే దిల్లీ అల్లర్లకు స్కెచ్

Last Updated : Feb 27, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.