ETV Bharat / state

ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్​ - CM KCR Invited For Donald Trump And President's Dinner ...

తెలంగాణ రాష్ట్ర సీఎంకు అరుదైన ఆహ్వానం అందింది. డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే విందుకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. విందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి 25న మధ్యాహ్నం దిల్లీకి వెళ్లనున్నారు.

Dawat with Trump .. CM KCR
ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్​
author img

By

Published : Feb 23, 2020, 5:25 AM IST

Updated : Feb 23, 2020, 7:23 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే విందుకు కేసీఆర్‌ను ఆహ్వానించారు. శనివారం రాష్ట్రపతి భవన్‌ ఈ మేరకు సీఎంకు లేఖను పంపింది.

25న రాత్రి 8 గంటలకు విందు

ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా ఈ నెల 25న రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొనే ఈ విందుకు పరిమిత సంఖ్యలో కేంద్ర మంత్రులు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం లభించింది.

26న తిరిగి హైదరాబాద్‌కు

ఆహ్వానం అందుకున్నవారిలో సీఎం కేసీఆర్‌తో పాటు అసోం, హరియాణా, కర్ణాటక, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ముఖ్యమంత్రులు ఉన్నారు. విందులో పాల్గొనేందుకు 25న మధ్యాహ్నం కేసీఆర్‌ దిల్లీకి వెళ్లనున్నారు. 26న హైదరాబాద్‌ తిరిగి వస్తారు.

ఇవీ చూడండి: 'పోలీసు బదిలీల్లో అక్రమాలు జరగలేదు'

Last Updated : Feb 23, 2020, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.