ETV Bharat / state

శరత్​... నేను కేసీఆర్​ను మాట్లాడుతున్నా...!

ఓ రైతు పడుతున్న బాధలను నేరుగా ముఖ్యమంత్రే ఫోన్​ చేసి తెలుసుకున్న సన్నివేశం ఒకేఒక్కడు సినిమాలో చూశాం. కానీ... మన రాష్ట్ర సీఎం దాన్ని నిజం చేసి ఆందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు తన గోడును ఫేస్​బుక్​ ద్వారా పంచుకోగా... దాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్​ అతనికి నేరుగా ఫోన్​చేసి భరోసా ఇచ్చారు.

author img

By

Published : Mar 27, 2019, 5:18 PM IST

Updated : Mar 27, 2019, 5:57 PM IST

ఫోన్​ కాల్​తో ఆశ్చర్యపరిచిన సీఎం...
ఫోన్​ కాల్​తో ఆశ్చర్యపరిచిన సీఎం...
మంచిర్యాల జిల్లా నెన్నెల్‌ మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్‌కు.. ముఖ్యమంత్రి కేసీఆర్​ స్వయంగా ఫోన్‌ చేసి అతని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తన ఏడెకరాల భూమిని ఇతరులకు వీఆర్వో కరుణాకర్‌ పట్టా చేశారని కేసీఆర్​తో శరత్​ ఆవేదన పంచుకున్నాడు. బాధితుని గోడును విన్న సీఎం... న్యాయం చేస్తామని అభయమిచ్చారు.

అసలేమైందంటే....

తన ఏడెకరాల భూమిని... వీఆర్వో హైదరాబాద్‌లో నివసిస్తున్న కొండపల్లి శంకరమ్మకు పట్టా చేశారన్నది శరత్‌ ఆరోపణ. తహసీల్దార్‌, సబ్‌ కలెక్టర్లకు ఫిర్యాదు చేసి 11 నెలలైనా... సమస్య తీరలేదు. ఇక లాభం లేదని ఫేస్‌బుక్‌లో తన ఆవేదన పంచుకున్నాడు. రైతుల వేదన సీఎంకు చేరే వరకు షేర్‌ చేయాలని తన ముఖచిత్ర స్నేహితులతో విజ్ఞప్తి చేశారు.

పోస్టు చూసి నేరుగా ఫోన్​...

ఫేస్‌బుక్‌లో పోస్టును చూసి సీఎం కేసీఆర్‌...నేరుగా శరత్‌కు ఫోన్‌ చేశారు. న్యాయం చేయాలని మంచిర్యాల కలెక్టర్‌ హోళికేరిని ఆదేశించారు. వెంటనే నందులపల్లిలో శరత్‌ ఇంటికి వెళ్లి కలెక్టర్‌ విచారణ చేపట్టారు.

మొత్తానికి ఓ ఫేస్ బుక్ పోస్ట్.. శరత్​ సమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి:సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే

sample description
Last Updated : Mar 27, 2019, 5:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.