రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పీజీ కళాశాల లోని సెంటినరీ అకడమిక్ బ్లాక్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని వసతులతో లైబ్రరీ, ఆడిటోరియం, క్లాస్ రూమ్లు నిర్మించారని కొనియాడారు. భవనం ఎదుట మొక్కను నాటి, హరితహారం చేపట్టారు. ప్రపంచ దేశాల్లో ఉన్నత విద్య కోసం అవలంభిస్తున్న విధానాలను, మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఉన్నత విద్యలో తెలంగాణను అగ్ర స్థానంలో నిలిపేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రామచంద్రం, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఎస్ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు