ETV Bharat / state

Kavitha Tweet On Wrestlers Issue : 'రెజ్లర్ల విషయంలో.. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి' - రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపిన కవిత

Kavitha Tweet On Wrestlers Issue : రెజ్లర్లకు అందరం అండగా ఉందామని ఎమ్మెల్సీ కవిత ట్వీట్​ చేశారు. ఈ మేరకు బ్రిజ్​ భూషణ్​ శరన్​ సింగ్​పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై కేంద్రం అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

kavitha
kavitha
author img

By

Published : May 31, 2023, 4:02 PM IST

Kavitha Tweet On Wrestlers Issue : రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్​ భూషణ్​ శరన్​ సింగ్​పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని తగిన పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

Kavitha Tweet : కష్టపడేతత్వం, నిబద్ధత, దేశభక్తితో మహిళా రెజ్లర్లు ప్రపంచానికి భారతదేశ ప్రతిభను కనబరిచారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం.. ఇలాగేనా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన అభియోగాలు ఉన్న నిందితుడు బయట తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన రెజ్లింగ్​ మహిళ క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తగదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రపంచమంతా చూస్తోందని.. దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • It is the hard work, dedication and patriotism of our women #Wrestlers that showed this talent of India to the world.

    The Government of India must think in the interest of the country in these 5 days. Even after a serious charge like POCSO, the accused is out in public, justice…

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) May 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెజ్లర్లకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు : రెజ్లర్లకు తెలంగాణ ప్రభుత్వం తన మద్దతును ప్రకటించింది. బ్రిజ్​ భూషణ్​ శరన్​ సింగ్​ చేత రాజీనామా చేయడం కన్నా.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద రెజ్లర్లు చేస్తోన్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ను అక్కడికి పంపించింది. దేశానికి పతకాలు సంపాదించి పెట్టిన రెజ్లర్లకు ఇదేనా గౌరవం అని ఆయన మండిపడ్డారు. దేశం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తోందని.. దేశ ప్రజలు, అన్ని రంగాల క్రీడాకారులు వీరికి మద్దతు తెలపాలని కోరారు.

అసలేం జరిగింది : భారత రెజ్లింగ్​ ఫెడరేషన్​ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్​ భూషణ్​ శరన్​ సింగ్​ తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఈ విషయంపై కేంద్రం తనను వెంటనే తమలో నుంచి తొలగించాలని.. అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు తమ పోరాటాన్ని ఉద్ద్రిక్తం చేశారు. దిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద నిరసనలు తెలిపారు. సుప్రీంకోర్టులో బ్రిజ్​ భూషణ్​కు వ్యతిరేకంగా పిటిషన్​ వేయడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.

Kavitha Support Of Struggle Of Wrestlers : రాజీనామా ఒక్కటే సరిపోదని.. మహిళలను లైంగికంగా వేధించిన తనపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు కోరారు. ఇందుకు అన్ని రంగాల క్రీడాకారుల నుంచి మద్దతు తెలిపారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా జంతర్​ మంతర్​ వద్ద నిరసన చేపట్టరాదని పోలీసులు రెజ్లర్లపై లాఠీలతో విరుచుకుపడ్డారు. దేశానికి ఇన్ని పతకాలు సాధించి పెట్టిన తమకు.. సరైన బహుమానం ఇచ్చారని ఆవేదన చెందుతూ.. ఆ పతకాలను గంగా వేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.