ETV Bharat / state

Kavach Application : 'కవచ్'​.. సైబర్ మోసాన్ని ఇట్టే పసిగట్టేస్తుంది.. మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.. - Kavach Application protects from Cyber frauds

Cyber Security Kavach Application : అమెరికాలో పనిచేసి.. భారత్‌కు తిరిగి వచ్చిన ఆమె.. నగరంలో జరుగుతున్న సైబర్‌ నేరాలు చూసి దిగ్భ్రాంతికి గురి అయింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో సైబర్‌భద్రత ఎదుర్కొంటున్న సవాళ్లు చూసి విస్తుబోయింది. అందుకే తనవంతుగా... ప్రక్షాళన దిశగా అడుగలేసి.. సరికొత్త ఏఐ సెక్యురిటీ అండ్‌ ఫ్రాడ్‌ ప్రొటెక్షన్‌ యాప్‌ను రూపొందించింది. ఇటీవలే గూగుల్‌ ప్లే స్టోరులో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ వివరాలివి.

Kavach
Kavach
author img

By

Published : Jun 30, 2023, 10:23 AM IST

సైబర్​ నేరం మీకు జరుగుతుందనుకుంటున్నార.... మందు జాగ్రత్త ఈ యాప్​ వాడండి

Kavach Digital Security Application : రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టే దిశగా నిత్యం చర్యలు కొనసాగుతున్నా క్రైమ్‌ రేటు తగ్గడం లేదు. అలాంటి సంఘటనే ఈమెకూ ఎదురైంది. కానీ అందరి లా పోనీలే అని సర్దుకుపోలేదు. తన అనుభవాన్ని ఉపయోగించి కవచ్‌ అనే యాప్‌ తయారు చేసింది. ఫోన్‌కు ఫ్రాడ్‌ మెసెజ్‌ వచ్చినా.. లేదా పొరపాటున ఫేక్ ఈ - కామర్స్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసినా.. వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది.

Kavach Application : ఈమె పేరు ప్రత్యూష. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ఉన్నత చదువులు పూర్తయ్యాక.. అమెరికాలో 18 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్‌ హెడ్‌గా పనిచేసి, భారత్‌కు వచ్చింది. ఏదో కొత్తగా చేయాలనే ఆలోచనతో ఉన్న తనకు... ఆన్‌లైన్‌లో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ యాప్‌ నిర్మించేందుకు స్ఫూర్తిగా నిలిచిన ఘటన అదే అని చెబుతోంది ప్రత్యూష.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 2021లో 52,974 సైబర్ నేరాలు నమోదయ్యా యి. గతంతో పోల్చితే గణాంకాలు దాదాపు 6% పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని రూపొందించిన యాప్‌ పనితీరు గురించి ఇలా వివరిస్తోంది ప్రత్యూష.

'నేను ఇండియాకి వచ్చినప్పుడు ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. దాని కోసం గూగుల్​లో వెతికాం. అంతా బాగానే ఉంది అనుకుని ఇంటికి డబ్బులు కట్టాం. రెండు నెలలు అయినా వారు రాకపోకవడంతో అప్పడు నాకు అర్థం అయ్యింది ఫ్రాడ్​ జరిగింది అని. కంప్లైంట్​ ఇవ్వడానికి పోలీస్​ స్టేషన్​ వెళ్లినప్పుడు నాలాగా చాలా మంది బాధితులు ఉన్నారని తెలిసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను సైబర్​ నేరాలను అడ్డుకోడానికి నేను ఏదైనా చెయ్యాలి అని. అప్పుడే ఈ యాప్ ఆలోచన వచ్చింది. ఫ్రాడ్​ కాల్స్​, మెసేజ్​లు వచ్చేముంది ఈ యాప్ మనల్ని హెచ్చరిస్తుంది.' - ప్రత్యూష, కవచ్‌ యాప్‌ రూపకర్త

Kavach Application protects from Cyber frauds : చాలా రోజుల శ్రమ తర్వాత ఇటీవలే యాప్ ప్లేస్టోర్లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ పలు భాషల్లో అందుబాటులోకి తెచ్చామంటోంది ప్రత్యూష. నెలకు 8 రూపాయల ఖర్చుతో ఈ యాప్‌ ఉపయోగించుకోవచ్చని చెబుతోంది. సైబర్‌సెక్యూరిటీలో తనదైన ముద్ర వేసిన ప్రత్యూష పలు అవార్డులు దక్కించుకుంది. సమాజంలో వీలైనంత మేర ప్రజలకు ఉపయోగం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెబుతోంది ప్రత్యూష. అంతేగాక అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలదే అని సూచిస్తోంది.

ఈ యాప్‌తో సైబర్‌ నేరాలను పూర్తిగా అరికట్టలేకున్నా.. అప్రమత్తం చేయవచ్చు. నేర కట్టడిలో ఈ యాప్‌ కీలకం కానున్న నేపథ్యంలో ప్రజలు దీని గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. నకిలీ వెబ్‌సైట్‌లు, సందేశాలకు ఈ యాప్‌ చరమగీతం పాడితే సమాజానికి సంతోషమే అంటోంది ప్రత్యూష.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.