కాశీ మహా క్షేత్రంలోని కాశీ విశ్వనాథుడు గుడి పక్కన వెలసివున్న శ్రీ అన్నపూర్ణ మాత మందిరంలో దీపావళి వేడుకలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే బంగారపు అన్నపూర్ణ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని మందిరం మహంత శ్రీ శంకర్ పూరి తెలిపారు. ఈసారి బంగారు అన్నపూర్ణ అమ్మవారి దర్శనం 2వ తేదీ దంతేరస్ సందర్భంగా ఆరోజు ఉదయం నాలుగు గంటల నుంచి 5వ తేదీ వరకు రాత్రి వరకు అన్నపూర్ణ అమ్మవారి గుడి లో మొదటి అంతస్తులో దర్శనం ఉంటుందని వెల్లడించారు.
ఈ నాలుగు రోజులు అమ్మ వారి ప్రసాదంగా ధాన్యము, ధనము, మహంత్ శ్రీ శంకర్ పూరి తమ చేతుల మీదగా భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ నాలుగు రోజులు విశేష అలంకారములు హారతులు కూడా నిర్వహిస్తారు. దీపావళి సందర్భంగా అమ్మవారి గుడిలో 5వ తేదీ మొత్తం 56 పిండి వంటలతో, స్వీట్లతో కుడ్డా అలంకారం, ధాన్యముతో కూడా అలంకారం చేసి తరువాత ఆ పిండి వంటలు స్వీట్లను భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ కార్యక్రమం వీక్షించేందుకు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు.