ETV Bharat / state

'ఆర్టీసీ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం' - దిల్లీలో ఎంపీ బండి సంజయ్

తెలంగాణకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఎంపీ బండి సంజయ్ దిల్లీలో పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని స్పష్టం చేశారు.

'రాష్ట్ర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం'
author img

By

Published : Nov 18, 2019, 12:08 PM IST

'రాష్ట్ర అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతాం'

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతానని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో ప్రజలకు వివరిస్తామన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ఉన్న శ్రద్ధ... అగ్రవర్ణాల పేదలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంటులో లేవనెత్తుతామన్న బండి సంజయ్‌... వారికి ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్‌ నిలుపుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.