తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమమే తెరాస ఎజెండా అని కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. తాము ప్రజల కోసం, రైతుల సంక్షేమం కోసం పరితపిస్తూ ఉంటే కాంగ్రెస్ భాజపాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడలేని విధంగా ఈసారి రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందన్నారు.
ఓవైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే మరోవైపు ఈ పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు చవాకులు మాట్లాడొద్దన్నారు.