Kamineni Hospitals Organized AIDS Awareness Walk: ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టాలని, ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామినేని హాస్పిటల్స్ ఎయిడ్స్ అవేర్నెస్ వాక్‌ను నిర్వహించింది. ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వాక్‌లో దాదాపు 500 మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామినేని హాస్పిటల్స్ అవగాహన కల్పించి ఎయిడ్స్‌ను అరికడదాం అనే ఉద్దేశ్యంతో దీనిని నిర్వహించారు.
ఈ మేరకు హెచ్ఓడీ, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ స్వామి ఎయిడ్స్ అవగాహన నడకను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద హెచ్ఐవీ అంటువ్యాధిని కలిగిన దేశంగా భారతదేశం ఉందన్నారు. అవగాహనతోనే ఎయిడ్స్‌ను దరిచేరనీయవచ్చని, ప్రజల్లో అవగాహనను చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చేయడంలో యువతరం కీలక పాత్ర పోషిస్తుందని అని తెలిపారు.
ఇవీ చదవండి: