ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల వేళ కొనసాగుతున్న ప్రలోభాల పర్వం - పెన్షన్ల పంపిణీ వద్ద వైకాపా అభ్యర్థి హల్​చల్​

మున్సిపల్ ఎన్నికల వేళ ప్రలోభాలు, బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. కళ్యాణదుర్గం పురపాలికలో వలంటీర్ పింఛను పంపిణీ చేస్తుండగా... 12 వార్డు వైకాపా అభ్యర్థి భర్త ప్రచారం నిర్వహించాడు. అడ్డుకోబోయిన తెదేపా అభ్యర్థితో వాగ్వాదానికి దిగాడు. అధికార పార్టీ అభ్యర్థిత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

kalyana-durgam-election-campaign-conflict
మున్సిపల్ ఎన్నికల వేళ కొనసాగుతున్న ప్రలోభాల పర్వం
author img

By

Published : Mar 1, 2021, 8:15 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని 12 వార్డు ఎర్రనేల వీధిలో వలంటీర్లు పింఛన్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైకాపా వార్డు అభ్యర్థులు పాల్గొని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని తెదేపా అభ్యర్థులు ఆరోపించారు.

పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి భర్త... వలంటీర్లను వెంట పెట్టుకొని ఫించన్లు పంపిణీ చేస్తున్నాడు. అడ్డుకోబోగా తమను దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని తెదేపా కార్యకర్తలు చెప్పారు. ఆ వార్డులో వైకాపా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కొలువుల లెక్కపై ప్రజలను మోసం చేస్తున్నారు: రాంచందర్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.