కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌పై ఎన్‌జీటీలో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ హయతుద్దీన్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అనుమతులను సవాల్ చేసే గడువు 90 రోజులకు ముగిసిపోయిందని... తర్వాత పిటిషన్ వేశారని... దీన్ని కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. వ్యాజ్యం ఆలస్యమైన విషయాన్ని అంగీకరించిన పిటిషనర్ తరఫు న్యాయవాది... నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఉన్నాయని వాదించారు. పిటిషన్‌ను విచారించేందుకు ఎన్జీటీ అంగీకరించింది. విచారణను ఆగస్టు 26కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి : మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత