నాంపల్లిలోని గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు జరిగాయి. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా శివసత్తులు పూనకాలు, లంబాడీలు, గిరిజన నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ సంబురాలతో అమరవీరుల స్థూపం వద్ద వాతావరణం కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, మామిడి హరికృష్ణ, పలువురు నాయకులు పాల్గొని అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం గన్ పార్క్ నుంచి రవీంద్రభారతి వరకు ర్యాలీగా వెళ్లారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కల ఫలించిన వేళ...