ETV Bharat / state

నేడు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించనున్న మంత్రులు

Kaleshwaram Project Issue : మేడిగడ్డ, అన్నారం ఆనకట్టల సమస్యలు, పరిష్కారంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ వల్ల కలిగిన లాభనష్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వివరించనుంది. మేడిగడ్డ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతోపాటు, ప్రాణహిత ప్రాజెక్టు విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సర్కార్ తదుపరి కార్యాచరణపై మంత్రులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Ministers visit Medigadda Barrage Today
Ministers visit Medigadda Barrage Today
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 6:56 AM IST

మేడిగడ్డ వద్ద ఇవాళ ప్రభుత్వం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

Kaleshwaram Project Issue : మేడిగడ్డ ఆనకట్టతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై, ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్‌పల్లి సమీపంలోని లక్ష్మీ ఆనకట్ట ఇందుకు వేదిక కానుంది. నలుగురు మంత్రులు ఈరోజు మేడిగడ్డతోపాటు అన్నారం బ్యారేజీలను సందర్శించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు.

Congress Ministers visit Medigadda Barrage Today : రీడిజైనింగ్ ద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చడం, దాని వల్ల కలిగిన లాభనష్టాలు, మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, అన్నారం బ్యారేజీ వద్ద సమస్యలు సహా అన్ని అంశాలపై మంత్రులు దృష్టి సారించనున్నారు. నలుగురు మంత్రులు, ఈఎన్సీ మురళీధర్ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ వద్దకు చేరుకుంటారు. అక్కడ నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

వైఎస్ హయాంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, ప్రాజెక్టు వల్ల కలిగిన లాభనష్టాలు, కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు సహా అన్ని అంశాలను అందులో ప్రస్తావిస్తారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం తీసుకున్న రుణాలు, చెల్లింపులు, అవసరమైన విద్యుత్ తదితర అంశాలు ఉంటాయి.

మేడిగడ్డ ఆనకట్ట (Medigadda Barrage) కుంగుబాటుతోపాటు సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా ప్రస్తావిస్తారు. మేడిగడ్డకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యలు, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేవనెత్తిన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ ప్రస్తావించిన అంశాలు సహా కేంద్ర జలసంఘం లేఖలు తదితరాలను కూడా ప్రస్తావించనున్నారు. అనకట్టలు, పంప్ హౌస్‌ల నిర్వహణ, వ్యక్తమైన అభిప్రాయాలు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్-సీడీఓ రాసిన లేఖలు తదితర అంశాలను కూడా వివరించనున్నారు.

Congress Ministers visit Annaram Barrage Today : ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు, వ్యయం, వాటి వినియోగం, లాంటి అంశాలను వివరించనున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ తర్వాత మంత్రులు అక్కడే ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని అంశాలపైనా సమగ్ర సమీక్ష జరపనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుతోపాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

మేడిగడ్డ ఆనకట్ట కుంగిన ప్రాంతాన్ని పరిశీలించనున్న మంత్రులు, కాపర్ డ్యాం నిర్మాణం, కుంగుబాటు కారణాల కోసం ఇన్వెస్టిగేషన్, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలతో చర్చించనున్నారు. ప్రాజెక్టులోని నిర్మాణ సంస్థలతోపాటు ఉప గుత్తేదార్లు, నిర్మాణాలతో సంబంధం ఉన్న అందరూ సమీక్షకు హాజరయ్యేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఎన్సీని ఆదేశించారు.

Ministers Power Point Presentation on Kaleshwaram : బ్యారేజీలకు సంబంధించి తదుపరి కార్యాచరణతో పాటు, ప్రాణహిత ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మంత్రులు స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడిగడ్డ అనంతరం అన్నారంను (Annaram Barrage) కూడా మంత్రులు సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలిస్తారు.

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.