తెలంగాణ ఫోటోగ్రపీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ఈనాడు గ్రూప్‌కు చెందిన ఉద్యోగి ఎంవీ రాధాకృష్ణమూర్తిని ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు వరించింది. ఆయనకు హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అవార్డు అందజేశారు. వరంగల్ నేషనల్ ఫొటోగ్రఫీ కన్వెన్షన్-2019 పేరిట నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో రాధాకృష్ణ తీసిన కాకతీయ హెరిటేజ్ చిత్రం ఉత్తమ ఛాయచిత్రంగా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు, తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి విశ్వేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం మాత్రమే కాదని... సామాజిక బాధ్యతతో ప్రపంచంలో జరుగుతున్న వాస్తవలను ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి :గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి