ఎన్నికల నియమావళిలో మార్పులు తెచ్చి రాజకీయ ప్రక్షాళన చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి భారత ప్రధాన న్యాయమూర్తిని కడియం శ్రీహరి రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల నియమావళిలో సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యులు సైతం పోటీ చేసేలా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కడియం శ్రీహరి కోరారు. జస్టిస్ రమణ నేతృత్వంలో భారత న్యాయవ్యవస్థలో మంచి మార్పులు వస్తాయని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: nv ramana: సోమవారం యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ