హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో కాచిగూడ పోలీస్ సిబ్బంది కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నిమ్బోలి అడ్డ వరకు 2కే రన్ నిర్వహించారు. యువతకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. యువతను భాగస్వామ్యంతో నగరంలో ట్రాఫిక్ వ్యవస్థపై అవగాహన, సూచనలు ఇస్తూ కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నగరవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీస్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ... అవగాహన కల్పించడమని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే వాటిపై అవగాహన కల్పించడం కోసమే ప్రారంభించామన్నారు.
ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ