Kacheguda Yesvantpur Vande Bharat Express : హైదరాబాద్ టు బెంగళూరుకు వందేభారత్.. ఈనెల 24న కాచిగూడ-యశ్వంత్‌పూర్ రైలు ప్రారంభం - సెప్టెంబరు 24న వందేభారత్ రైలు ప్రారంభం
Kacheguda Yesvantpur Vande Bharat Express : రెండు ఐటీ నగరాల మధ్య వందేభారత్ రైలు కూతపెట్టనుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు ఈ రైలు నడవనుంది. ఈనెల 24న ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు తగిన ట్రయల్ రన్‌ను కూడా ఈ రైలు పూర్తి చేసుకుంది.
Published : Sep 22, 2023, 9:42 AM IST
Kacheguda Yesvantpur Vande Bharat Express : బెంగళూరు- హైదరాబాద్ మధ్య వందేభారత్ రైలు(Vande Bharat) పరుగులు పెట్టనుంది. ఇప్పటికే కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందే భారత్ ట్రయల్ రన్‌ను నిర్వహించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రయల్ రన్ విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు.
Hyderabad To Bangalore Vande Bharat Train : ఈ నెల 24వ తేదీన (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వర్చువల్‌గా(దృశ్యమాధ్యమం) ద్వారా వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. అదే రోజున విజయవాడ- చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం అవుతుందని ఒకేరోజులో సుమారు 9 రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan Reddy), రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ఈనెల 25వ తేదీ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంత్ పూర్‌కు మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్ (బెంగళూరు)కు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:45 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది.
ప్రధాని హైదరాబాద్ పర్యటన.. రూ.11వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Vande Bharat From Hyderabad To Bangalore : ఈనెల 24వ తేదీన ప్రారంభించే రైళ్లలో విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌కు చేరుకోనుంది. రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుందని రైల్వే శాఖ పేర్కొంది. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని చెప్పారు. గురువారం మినహా మిగితా రోజుల్లో విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లును పూర్తి చేసింది. అందులో భాగంగా గత నెలలో కాచిగూడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ రైల్వే స్టేషన్ వరకు సన్నాహాక పరీక్షను నిర్వహించారు. ఈ ట్రయిల్ రన్లో ట్రాక్ సామర్థ్యం, రైలు వేగం, సాంకేతకతపై రైల్వే అధికారులతో కలిసి హైదరాబాద్ డీఆర్ఎం లోకేశ్ వైష్ణోయి వందేభారత్ రైలులో ప్రయాణించి ప్రత్యక్షంగా పరిశీలించారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య సుమారు ఏడు రైళ్లు నడుస్తున్నాయి. ఇవి ప్రయాణించే సమయం 11 గంటల నుంచి 12 గంటలు పడుతుంది. దీంతో వేగంగా ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది కాస్త ఇబ్బందిగా మారనుంది. వందే భారత్ రైలు రాకతో కేవలం 8.30 గంటల్లోనే రాకపోకలు సాగించవచ్చు.
కూతపెట్టిన సికింద్రాబాద్- తిరుమల వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ