ETV Bharat / state

KA Paul Ready to Contest in TS Elections : 'బీఆర్ఎస్​, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ '

KA Paul Ready to Contest in TS Elections : తెలంగాణలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు రెండూ ఒకటేనని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ ఆరోపించారు. కాంగ్రెస్​లో తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు.. కేసీఆర్​ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ.. ఒంటరిగానే పోటీ చేయబోతుందని పేర్కొన్నారు.

KA Paul Fires on BRS
KA Paul Ready to Contest in TS Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 5:34 PM IST

KA Paul Ready to Contest in TS Elections : తెలంగాణలో బీఆర్​ఎస్​ కుటుంబ, కుల, అక్రమ, అవినీతి పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(KA Paul) విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలు రెండూ ఒకటేనని.. కాంగ్రెస్​లో తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేసీఆర్(CM KCR) కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

KA Paul on Telangana Assembly Elections 2023 : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తా: కేఏ పాల్

KA Paul Fires on BRS : ఇందుకోసం కొందరు అభ్యర్థులను.. తన పార్టీ నుంచి రాజీనామా చేయించి కాంగ్రెస్​లో చేర్పించారని దుయ్యబట్టారు. కేసీఆర్​, రేవంత్​రెడ్డి.. ఒకరినొకరు బహిరంగంగా దూషించుకున్న ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ.. టీజేఎస్​, వైఎస్‌ఆర్​టీపీలను తన స్వార్థం ఉపయోగించుకుందని విమర్శించారు. కేసీఆర్​కి గుడ్ బై చెప్పాలంటే.. ముందు కాంగ్రెస్​కి గుడ్ బై చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నా.. ముఖ్యమంత్రిగా మాత్రం బీసీ అభ్యర్థిని చెయ్యరని మండిపడ్డారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు.. ప్రజాశాంతి పార్టీలో 60 శాతం సీట్లు ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు, కేసీఆర్ కుట్రలపై ఇప్పటి వరకూ 7 కేసులు కోర్టులో వేశానని.. దీంతో కేటీఆర్ తనపై దాడి చేయించారని తెలిపారు. రాష్ట్రంలో కులసంఘాలు ఎవరూ టికెట్లను అడగవద్దని సూచించారు. వారి కోసం ప్రజాశాంతి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న వారు.. వారం రోజుల్లో 10వేల రూపాయలు ఫండ్​తో పాటు వివరాలు పంపాలని తెలిపారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తున్నామన్న ఆయన.. వారం రోజుల్లో అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

"నేడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్​ఎస్​ కుటుంబ అవినీతి పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ పార్టీలు రెండు ఒక్కటే. కాంగ్రెస్​లో తన అభ్యర్థులను గెలిపించుకునేందుకు..కేసీఆర్​ కుట్ర పన్నుతున్నారు. ఇందుకోసం బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులను.. కాంగ్రెస్​లోకి చేర్పించారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. రాష్ట్ర జనాభాలో 60శాతంగా ఉన్న బీసీలకు.. ప్రజాశాంతి పార్టీలో 60శాతం సీట్లు కేటాయిస్తాము". - కేఏ పాల్​, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

KA Paul Ready to Contest in TS Elections 'బీఆర్ఎస్​, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ '

KA Paul on Telangana Elections 2023 : 'తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం'

KA Paul on Human Rights Commission : 'వారం రోజుల్లో హెచ్​ఆర్​సీ, ఎస్సీ, ఎస్టీ​ కమిషన్ ఛైర్మన్లు, సభ్యులను నియమించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.