ETV Bharat / state

అది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు: జస్టిస్ ఉజ్జల్ భూయాన్

New Legal Services Authorities Started: న్యాయ సహాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొత్తగా 23 న్యాయసేవాధికార సంస్థలను జస్టిస్ ఉజ్జల్​ భూయాన్​ వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Justice Ujjal Bhuyan
జస్టిస్ ఉజ్జల్ భూయాన్
author img

By

Published : Jan 2, 2023, 5:23 PM IST

New Legal Services Authorities Started: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 23 న్యాయసేవాధికార సంస్థలను రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం వర్చువల్​గా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేగంగా నూతన న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేయగలిగినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్​ తెలిపారు.

న్యాయవ్యవస్థలో లీగల్ ఎయిడ్ ఓ భాగమైందని అన్నారు. న్యాయసహాయం పొందడం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కు అని సీజే జస్టిస్​ ఉజ్జల్​ భూయాన్​ పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ అందించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత జడ్జీలతో పాటు.. న్యాయవ్యవస్థలోని అందరిపై ఉందని వెల్లడించారు. లోక్ అదాలత్​ను సమర్థంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త సంవత్సరం అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

గతేడాది రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ద్వారా 10,640 మందికి న్యాయ సహాయం అందించినట్లు సంస్థ కార్యనిర్వాహక ఛైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు తెలిపారు. లోక్ అదాలత్​లలో రూ.14.78 కోట్లు విలువైన 16,22,885 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.