ETV Bharat / state

ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పిన జస్టిస్ రంజన్​ గొగొయ్

author img

By

Published : Aug 10, 2019, 10:55 PM IST

Updated : Aug 13, 2019, 11:42 AM IST

హైదరాబాద్​లోని జాతీయ పోలీసు శిక్షణ సంస్థలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశానికి పోలీసులు చేసిన సేవలు శ్లాఘనీయమని కొనియాడారు.

ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన జస్టిస్ రంజన్​ గొగొయ్

ఆధునిక ప్రజాస్వామ్యంలో న్యాయ సూత్రాలు అనే అంశంపై హైదరాబాద్​లోని జాతీయ పోలీసు శిక్షణ సంస్థలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్మారకోపన్యాసం చేశారు. ఐపీఎస్​లో చేరిన యువ సాధకులు భవిష్యత్తులో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దేశానికి పోలీసులు చేసిన సేవలు శ్లాఘనీయమన్న ఆయన.. సంప్రదాయ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులన్నా-దేశం కోసం ప్రాణాలొదిలిన పోలీసుల సంఖ్య తక్కువేమీ కాదన్నారు. న్యాయపరమైన సమానత్వం, రాజకీయ స్వేచ్ఛ, నియమబద్ధ పాలన... ప్రజాస్వామ్య వ్యవస్థకు నిజమైన అర్థాలన్నారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు, న్యాయ సూత్రాలు కీలకంగా మారాయని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, ఎన్​పీఏ డైరెక్టర్ అభయ్, హైకోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

Justice Ranjan Gogoi who interprets democracy

ఇవీ చూడండి: 'దేశాన్ని ఉప్పెనలా ముంచేస్తున్న మతవాదం'

Intro:Body:Conclusion:
Last Updated : Aug 13, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.