ETV Bharat / state

ఏపీ కొత్త సీజే @ క్రికెటర్‌.. సంపాదకుడు.. న్యాయకోవిదుడు - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి.. న్యాయకోవిదుడే కాదు. మంచి క్రికెటర్‌గానూ గుర్తింపు పొందారు. రంజీట్రోఫీలో అసోం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. గువాహటి హైకోర్టు ద్వైవార్షిక బులెటిన్‌కు సంపాదకుడిగానూ పని చేశారు.

justice-arup-kumar-goswami-will-be-the-next-chief-justice-of-the-ap-high-court
ఏపీ కొత్త సీజే @ క్రికెటర్‌.. సంపాదకుడు.. న్యాయకోవిదుడు
author img

By

Published : Dec 20, 2020, 12:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి.. న్యాయకోవిదుడు మాత్రమే కాదు. మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. గువాహటి హైకోర్టు నుంచి వెలువడే ద్వైవార్షిక బులెటిన్‌ అయిన 'ఆత్మన్‌'కు కొద్దికాలం పాటు సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జస్టిస్‌ గోస్వామి ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న విషయం తెల్సందే. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సూచించింది.

1961 మార్చి 11న అసోం రాష్ట్రంలోని జోర్హాట్‌లో పుట్టిన ఆయన.. రంజీట్రోఫీలో అసోం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్‌ స్థాయిలో తూర్పు మండలానికి అండర్‌-19, అండర్‌-22 జట్ల తరఫున ఆడారు. 1985లో న్యాయవాద పట్టా పొందిన కొన్ని ఏళ్ల తర్వాత ఆయన హైకోర్టులో న్యాయమూర్తి అయ్యారు. 2019లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే ముందు కొన్నాళ్ల పాటు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఈశాన్య భారతానికి సేవలు

అసోంలోని జోర్హాట్‌ ప్రాంతంలో పుట్టి, గువాహటిలో చదువుకున్న జస్టిస్‌ గోస్వామి.. ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాలకు తన సేవలు అందించారు. అసోం, నాగాలాండ్‌, మేఘాలయ, మణిపుర్‌, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఏడు రాష్ట్రాల్లోనూ 1985లో న్యాయవాదిగా బార్‌ కౌన్సిళ్లలో నమోదయ్యారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగ, సర్వీసు సంబంధిత అంశాల్లో ఆయన నిపుణుడు. నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు 2011 నుంచి 2013 వరకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థకు 2016 నుంచి 2019 వరకూ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇదీ చదవండి: అంతరిక్షంలో ఆంధ్రా అమ్మాయి అద్భుతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.