ETV Bharat / state

Junior panchayat secretaries strike : 'ప్రభుత్వం దిగొచ్చే వరకు తగ్గేదిలే' - Panchayat secretaries strike at Gunpark

Panchayat secretaries strike at Gunpark : తెలంగాణలో జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల సమ్మె యథావిధిగా కొనసాగుతోందని రాష్ట్ర పంచాయతీ సెక్రటర్స్ ఫెడరేషన్​ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 5గంటల వరకు తుది గడువు విధించిన నేపథ్యంలో వారు స్పందించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని అమరవీరుల స్థూపం ముందు జేపీఎస్​లు నిరసనలు చేపట్టారు.

Junior panchayat
Junior panchayat
author img

By

Published : May 9, 2023, 4:49 PM IST

Updated : May 9, 2023, 7:29 PM IST

Panchayat secretaries strike at Gunpark : తమను రెగ్యూలరైజ్​ చేయాలని కోరుతూ.. గత 11రోజులుగా జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు చేస్తోన్న సమ్మె ఇవాళ కొనసాగించారు. తమను క్రమబద్దీకరించే వరకు సమ్మె విషయంలో వెనుకడుగు వేసేప్రసక్తే లేదని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ​ ఫెడరేషన్​ స్పష్టం చేసింది. ఈ మేరకు సమ్మె యథావిధిగా కొనసాగుతోందని యూనియన్​ ప్రకటించింది.

హైదరాబాద్​లోని అమరవీరుల స్థూపం ముందు ఇవాళ రాష్ట్ర పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ నిరసన చేపట్టింది. ప్రభుత్వం తమను భయపెట్టాలని చూస్తే పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమం ద్వారా తెలంగాణ తీసుకొచ్చారని.. అదే స్ఫూర్తితో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్నామని పునరుద్ఘటించారు.

"గత 11రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నాం. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇది కాకుండా సమ్మె నోటీసు ఇవ్వడం చాలా బాధకరం. ఇప్పటికే మా తోటి ఉద్యోగస్థులను కోల్పోయాం. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నాం".- పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్​

Junior panchayat secretaries strike: ఇప్పటికైనా సీఎం తమపై కక్షసాధింపులకు చర్యలకు వెళ్లకుండా.. సుమారు 9వేల 355 కుటుంబాల్లో వెలుగులు నింపి.. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జేపీఎస్​లు చేస్తోన్న సమ్మెపై ప్రభుత్వం ఇవాళ సాయంత్రం 5గంటలు వరకు డెడ్​లైన్​ విధించిన సంగతి తెలిసిందే.. కాగా ప్రభుత్వ నిర్ణయం మేరకు పంచాయతీ కార్యదర్శులు రేపటి నుంచి విధులకు హాజరు అవుతారా..! లేదా అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

నోటీసులు జారీ: రాష్ట్రంలో గత 11రోజులుగా సమ్మె చేస్తోన్న 9వేల 350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు ఇచ్చారు.

Revanth Reddy on Panchayat secretaries: పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సీఎం కేసీఆర్​కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే దారుణంగా తయారైందని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు జూనియర్ కార్యదర్శుల కష్టంతోనే వచ్చాయని రేవంత్​రెడ్డి గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 9, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.