తెరాస సభ్యత్వ నమోదు విజయోత్సవ సభలో పాల్గొన్న కేటీఆర్ ఐదేళ్ల కాలంలో కేసీఆర్ సాధించిన ఘనతను కార్యకర్తలకు వివరించారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు పాలించిన విధానం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ నాయకత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కార్యకర్తలతో పంచుకున్నారు. ఒకప్పుడు వినాయక చతుర్థి వచ్చిందంటే కర్ఫ్యూలు ఉండేవన్నారు. ప్రస్తుతం శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే... కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో వారి పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్ నాయకులు ఆలోచించుకోవాలని తెలిపారు.
50 లక్షల మందికి పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ సభలో తెలిపారు. ఏటా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పింఛన్ల కోసం కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతే హైదరాబాద్‌కు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు.
ఇదీ చూడండి :కేవీబీఆర్ స్టేడియంలో కేటీఆర్ సభ... తరలివస్తున్న కార్యకర్తలు