Jubilee Hills Murder Case : మహబూబాబాద్ జిల్లా శంకిస గ్రామానికి చెందిన కార్తీక్ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నాడు. గత నెల 13నుంచి కార్తీక్ ఫోన్ స్విచ్చాఫ్ రావటంతో మూడ్రోజుల (Jubilee hills Artist Murder Case Update) తర్వాత సోదరుడు శంకర్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. యువకుడు అదృశ్యానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవటం, కార్తీక్ గురించి ఎవరూ చెప్పే అవకాశాలు లేకపోవటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే కార్తీక్ అదృశ్యానికి ముందు కొందరు యువకులతో గొడవ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నళ్లపై దృష్టి సారించిన పోలీసులు.. అనుమానితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా.... విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
పిల్లి అరుపులకు చికాకుపడి పక్కరూం యువకున్ని తగలబెట్టేసిన బాలుడు
Jubilee hills Junior Artist Murder Case Update : విజయనగరం జిల్లా గొర్ల మండలం రాగోలు గ్రామానికి చెందిన సాయి యూట్యూబర్. అతడికి జూనియర్ ఆర్టిస్ట్‌తో పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్లకు సాయి ప్రవర్తన నచ్చక యువతి దూరంగా ఉంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు కార్తీక్ దగ్గరయ్యాడు. గత నెల 9న యువతిని తీసుకెళ్లిన కార్తీక్.. యూసూఫ్‌గూడ వెంకటగిరి కాలనీలో నివాసముంటున్న సోదరుడు శంకర్ గదికి వెళ్లాడు. ఇద్దరూ మూడ్రోజుల పాటు అక్కడే ఉన్నారు. తాను ప్రేమించిన యువతి మరొకరితో చనువుగా ఉండటాన్ని సాయి సహించలేకపోయాడు. యూసుఫ్‌గూడలోని వారి గదికెళ్లి ఇద్దరినీ బెదిరించాడు. అయినా ఎలాంటి మార్పులేకపోవటంతో ఎలాగైనా కార్తీక్‌ను అడ్డు తొలగించాలనుకున్నాడు. స్నేహితుడి ద్వారా పరిచయమైన విజయనగరం జిల్లాకు చెందిన కె.సురేష్ , ఎం.రఘు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.జగదీశ్ సాయంతో కార్తీక్‌ను హత్య చేసేందుకు పథకం రచించారు. గత నెల 13 సాయంత్రం రెండు ద్విచక్రవాహనాలపై కార్తీక్ గదికి వెళ్లిన యువకులు.. యువతి దుస్తులు తమ గదిలో ఉన్నాయని, వచ్చి తీసుకెళ్లమని నమ్మించారు. కార్తీక్‌ను వెంటబెట్టుకుని, 2 ద్విచక్రవాహనాలపై ఓల్డ్‌బోయిన్‌పల్లి పాత విమానాశ్రయం మార్గంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. అటవీ ప్రాంతం మధ్యకు చేరగానే కార్తీక్ ద్విచక్రవాహనం పై నుంచి కిందపడేశారని డీసీపీ తెలిపారు.
Extra Marital Affair Murder Rangareddy : హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం.. ఏడుగురు అరెస్టు
"సాయికి కార్తీక్‌కి మధ్య ఒక అమ్మాయి విషయంలో గొడవ అయ్యింది. ఆ అమ్మాయికి ముందు సాయితో పరిచయం ఉంది.. అయితే ఈ అమ్మాయి కార్తీక్‌తో ఉంటుంది సాయికి నచ్చలేదు. దీంతో సాయి కార్తీక్ అడ్డుతొలగించుకోవడానికి అతన్ని చంపడానికి ప్లాన్ చేసి చంపేశాడు." - జోయల్ డేవిస్, పశ్చిమ మండల డీసీపీ
అటవీ ప్రాంతానికి కార్తీక్‌ను తీసుకెళ్లిన యువకులు.. చేతులు వెనక్కి విరిచి దాడి చేశారు. చెట్టుకు కట్టేసి వెంట తెచ్చుకున్న కత్తితో పక్కటెముకల్లో పొడిచి.. బండరాతితో తలపై బాదారు. అనంతరం, గొంతుకోసి మృతదేహాన్ని చెట్ల ఆకుల మధ్య పడేశారు. అనంతరం, నలుగురు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటువైపు జనసంచారం లేకపోవటంతో ఎవరూ గమనించక.. మృతదేహం ఆనవాళ్లు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయింది. కార్తీక్ హత్యకు గురై 25 రోజులు కావటంతో కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయిని పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
Hyderabad Boy Nala death Case Update : బాచుపల్లి నాలాలో బాలుడు మృతి కేసు.. వారి నిర్లక్ష్యమే కారణం
హత్యానంతరం ముగ్గురు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. నిందితుల్లో ఒకరైన సురేష్ మృతుడి సెల్‌పోన్ తీసుకొని నగరంలోనే ఉండిపోయాడు. పోలీసుల దర్యాప్తులో యూసుఫ్‌గూడలో అమ్మాయి విషయమై గొడవ జరిగినట్టు ఆధారాలు లభించగా.. కార్తీక్ అదృశ్యం తరువాత ఐదుగురి సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. కొద్దిరోజుల తరువాత సురేష్ తన వద్ద ఉన్న కార్తీక్ సెల్‌ఫోన్ ఆన్ చేశాడు. అప్పటికే ఈ ఐదుగురి ఫోన్ల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్న పోలీసులకు.. కార్తీక్ ఫోన్ ఆన్ కావటంతో కేసు కొలిక్కి వచ్చింది. తొలుత సురేష్‌ను అదుపులోకి తీసుకోవటంతో హత్యోదంతంతో పాటు మిగిలిన ముగ్గురు నిందితుల గురించి వివరించాడు. నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారించటంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో యువతి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనాసలంలో లభించిన ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.