ETV Bharat / state

కొలువుల జాతర.. ఖాళీలు 65వేలు! - తెలంగాణలో ఉద్యోగ సమాచారం

తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి. వివిధ శాఖల్లో సుమారు 45వేలు, సంస్థల్లో 20వేల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు.

కొలువుల జాతర.. ఖాళీలు 65వేలు!
కొలువుల జాతర.. ఖాళీలు 65వేలు!
author img

By

Published : Dec 22, 2020, 5:02 AM IST

రాష్ట్రంలో కొలువుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. ఆయా శాఖల వారీగా ఖాళీల వివరాలను ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివేదించారు. వివిధ శాఖల్లో సుమారు 45వేలు, సంస్థల్లో 20వేలు ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్నట్లు వివరాలు ప్రభుత్వానికి చేరాయి. వాటిలో నాలుగోతరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్లు తెలిపారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు.

పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాల విద్యా శాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. వాటిలో ప్రత్యేక గ్రేడ్​ ఉపాధ్యాయులు 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్​ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు 1,000 ఉన్నాయి. వీటితో పాటు ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖ పోస్టులు మరో మూడువేల వరకు ఉన్నాయి. శాఖల వారీగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీకరిస్తోంది. మొత్తం పోస్టుల్లో నాలుగోతరగతి మినహాయించి... మిగిలినవి ఖాళీగా చూపిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే వీలుంది.

ఇదీ చూడండి: తెలంగాణలో విద్యాభివృద్ధికి కేసీఆర్ కృషి: ఇంద్రకరణ్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.