ETV Bharat / state

'ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దు' - students original certificates

ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్టు హైకోర్టుకు జేఎన్​టీయూహెచ్ నివేదించింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ చేర్చినట్లు వెల్లడించింది.

jntuh latest news, Private colleges do not take students original certificates
'ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దు'
author img

By

Published : Apr 16, 2021, 4:24 AM IST

ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్టు హైకోర్టుకు జేఎన్​టీయూహెచ్ నివేదించింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ చేర్చినట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేస్తామని తెలిపింది.

యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు వ్యవహహరిస్తున్నాయని ఫోరం ఆగేనెస్ట్ కరప్షన్ దాఖలు చేసిన పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలేజీలు ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకున్నట్టు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఓయూ తెలిపింది. ఓయూ, జేఎన్ టీయూహెచ్ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పిల్​పై విచారణను ముగించింది.

ఇదీ చూడండి : 'ఆ ముస్లిం ఉద్యోగులు గంట ముందే వెళ్లొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.