ETV Bharat / state

ఈ నెల 20 నుంచి జేఎన్​టీయూ​ చివరి సెమిస్టర్​ పరీక్షలు

ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీ-ఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభించాలని జేఎన్ టీయూహెచ్ నిర్ణయించింది. పరీక్షకు హాజరు కాలేకపోతే.. అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ రాసే అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వెల్లడించింది. పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించింది. విద్యార్థులు చదువుతున్న కళాశాలలోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది.

JNTUH latest news
JNTUH latest news
author img

By

Published : Jun 5, 2020, 12:03 AM IST

Updated : Jun 5, 2020, 1:50 AM IST

ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఫార్మాడీ పరీక్షలపై జేఎన్​టీయూహెచ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకవేళ కరోనా పరిస్థితుల కారణంగా పరీక్షలకు హాజరు కాలేకపోతే.. 45 రోజల తర్వాత నిర్వహించే అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీకి హాజరు కావచ్చునని తెలిపింది.

జులై 16 నుంచి బీటెక్, బీఫార్మసీ మొదటి, రెండవ, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్.. ఫార్మా-డీ 2,3,4,5 సంవత్సరాల పరీక్షలు ఉంటాయని జేఎన్​టీయూహెచ్ ప్రకటించింది. ఆగస్టు 3 నుంచి బీటెక్, బీఫార్మసీ 1,2,3,4 సంవత్సరాల మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ... ఎంటెక్, ఎం-ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేసింది.

పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్కుల వంటి కరోనా నివారణ జాగ్రత్తలు కచ్చితంగా చేపట్టాలని కళాశాలల ప్రిన్సిపాళ్లకు జేఎన్​టీయూహెచ్ పరీక్షల విభాగం లేఖలు రాసింది.

మూడు కాదు...రెండు గంటలే....

యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల విధానానికి సంబంధించి జేఎన్​టీయూహెచ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో మూడు గంటలు ఉండే పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించింది. స్వల్ప సమాధానాల ప్రశ్నల్లో కచ్చితంగా రాయాల్సినవి ఉండవని స్పష్టం చేసింది. మిగతా వాటిలో ఎనిమిదింటిలో ఐదు రాస్తే సరిపోతుందని వెల్లడించింది. విద్యార్థులు 20 నిమిషాల్లోనే సమాధానాలు రాసేలా ప్రశ్నపత్రం రూపొందించనున్నట్లు ప్రకటించింది.

డిటెన్షన్ రద్దు...

ఈ విద్యా సంవత్సరం క్రెడిట్ల ఆధారిత డిటెన్షన్ రద్దు చేసి.. అన్ని సెమిస్టర్ల విద్యార్థులను పై సెమిస్టర్​కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. లాక్​డౌన్ ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు విద్యార్థులు తరగతికి హాజరైనట్లుగా గుర్తిస్తారు. అంతకుముందు తరగతులకు హాజరైన శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని హాజరును లెక్కిస్తారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలలోనే పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని జేఎన్​టీయూహెచ్ నిర్ణయించింది.

Last Updated : Jun 5, 2020, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.