ప్రముఖ ఆయుర్వేద మందుల తయారీ కంపెనీ జీవికా ఆయుర్ సైన్సెస్(JIVIKA AAYUR SCIENCES).. రాష్ట్రంలో నూతన తయారీ పరిశ్రమ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.120 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ (HYDERABAD) జీనోం వ్యాలీ(GENOME VALLEY)లో నెలకొల్పే నూతన యూనిట్‌ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని జీవికా ఫార్మా వ్యవస్థాపకులు, సీఈవో మణి వర్గీస్ ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, పరిశ్రమ ఏర్పాటుకు తగిన వాతావరణం ఉన్నందునే హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.
'జీవికా ఆయుర్ సైన్సెస్ తయారీ పరిశ్రమకు హైదరాబాద్ అనుకూలంగా భావించాం. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం. ఈ ఫార్మా కంపెనీ ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఆయుర్వేద మందుల తయారీ కోసం.. వ్యవసాయం రంగంలో తెలంగాణ వాతావరణం అనుకూలిస్తుంది. అందుకే ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం.' -డాక్టర్ విల్సన్, జీవికా ఆయుర్ సైన్సెస్ ప్రతినిధి
ఆయుర్వేద మందుల తయారీ పరిశ్రమ సహా పరిశోధన కేంద్రం, గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ క్వార్టర్లను హైదరాబాద్‌లో నెలకొల్పుతామని మణి వర్గీస్ తెలిపారు. ఈ యూనిట్లలో 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. జీవికా ఆయుర్ సైన్సెస్ నుంచి 30రకాల ఆయుర్వేద మందులను ఈ అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తెస్తామని మణి వర్గీస్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఈ మందులను అమెరికా, బ్రిటన్, లాటిన్ అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: Hyderabad rain: అలర్ట్ హైదరాబాద్... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి