ETV Bharat / state

సులభంగానే జేఈఈ మెయిన్‌ పేపర్‌-1

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తొలి రోజు రెండు పరీక్షల్లోనూ.. ప్రశ్నలు సులభంగా వచ్చినట్లు విద్యార్థుల పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం చూసిన నిపుణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో 2 రోజులు ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.

JEE Main Paper-1 is easy says students
సులభంగానే జేఈఈ మెయిన్‌ పేపర్‌-1
author img

By

Published : Feb 25, 2021, 5:47 AM IST

జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 తొలి రోజు రెండు పరీక్షలు సులభం నుంచి మధ్యస్తంగా ఉన్నాయని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఐటీల్లో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మూడు రోజులు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల్లో ఆరు విడతల్లో జరిగే ఈ పరీక్షలకు 6.61 లక్షల మంది హాజరుకానున్నారు.

తొలిరోజు దాదాపు రెండు లక్షల మంది హాజరై ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యత చూస్తున్న జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తొలి రోజు హాజరు శాతాన్ని ప్రకటించలేదు. ఏపీలో 20, తెలంగాణలోని 10 నగరాలు, పట్టణాల్లో జరిగిన పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి ఇంటిజర్‌ ప్రశ్నల్లో ఛాయిస్‌ ఇవ్వడంతో 300కి 300 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రసాయన, భౌతికశాస్త్రం ప్రశ్నలతో పోలిస్తే గణితం ప్రశ్నలకు కొంత ఎక్కువ సమయం పట్టినట్లు చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సులభంగా ఉందని ఆకాశ్‌ జాతీయ అకడమిక్‌ సంచాలకులు అజయ్‌కుమార్‌శర్మ తెలిపారు.

ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచే ప్రశ్నలు

మొదటి విడతలో గణితం ప్రశ్నలు పెద్దగా ఉన్నాయి. భౌతిక, రసాయనశాస్త్రం ప్రశ్నలు గణితంతో పోల్చుకుంటే సులభంగా ఉన్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచే మొత్తం వచ్చాయి. ఓ సగటు విద్యార్థి గణితంలో 16, భౌతికశాస్త్రంలో 17, రసాయనశాస్త్రంలో 20 ప్రశ్నలకు సులభంగా జవాబులు రాయగలరు. రసాయనశాస్త్రంలో ఇనార్గానిక్‌ ప్రశ్నలు కొంచెం తికమక పెడతాయి. మధ్యాహ్నం విడతలో గణితం, భౌతికశాస్త్రం ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయి. రసాయనశాస్త్రం ప్రశ్నలు ఎక్కువగా జ్ఞాపకశక్తి ఆధారంగా, నేరుగా జవాబులు గుర్తించేలా ఉన్నాయి. మొత్తంమీద మొదటి విడత సులభంగా, రెండో విడత(మధ్యాహ్నం) ప్రశ్నపత్రం మధ్యస్తంగా ఉంది.

- ఎం.ఉమాశంకర్‌, జేఈఈ నిపుణులు.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.