JC Prabhakar Reddy Comments: మామూళ్లు ఇవ్వలేదని తమ ఎమ్మెల్యే పరిశ్రమలు మూయించి.. కూలీలు, కార్మికుల కడుపు కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. యాడికి మండలం రాయలచెరువులో మూతపడిన బలపం పౌడర్ పరిశ్రమలను తెరిపించాలని.. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలిశారు. రైల్లో వెళ్లే ప్రయాణికుడి కంట్లో దుమ్ము పడిందని, 13 పరిశ్రమలు మూసేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 16వ తేదీలోపు మూసేసిన పరిశ్రమలను తెరిపించకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.
"బ్రిటీష్ కాలం నుంచి ఉన్న ఫ్యాక్టరీలు ఇప్పుడు మూసేయడానికి కారణం ఏంటి. మామూళ్లు ఇవ్వలేదని పరిశ్రమలు మూయించేశారు. ప్రజలు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఫ్యాక్టరీ ఓనర్లు కూడా భయపడ్డారు. అమర్‌రాజా ఫ్యాక్టరీ తెలంగాణకి పోవడానికి కారణం ఎవరు". - జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్
ఇవీ చదవండి: