ETV Bharat / state

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గృహనిర్బంధం

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పోలీసులు జేసీ సోదరులను గృహ నిర్బంధం చేశారు.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గృహనిర్బంధం
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి గృహనిర్బంధం
author img

By

Published : Jan 4, 2021, 10:53 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ.. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద.. జేసీ ప్రభాకర్‌రెడ్డి మౌనదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పోలీసులు జేసీ సోదరులను గృహ నిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాడిపత్రిలో ఈ నెల 24న వైకాపా, తెదేపా నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడిలో.. పోలీసులు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. తాము ఎలాంటి ఫిర్యాదులు చేయకపోయినా.. పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు ఎలా నమోదు చేస్తారంటూ.. పోలీసుల తీరుకు నిరసనగా జేసీ సోదరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దార్‌ కార్యాలయంలో మౌన దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు తాడిపత్రిలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్నందున.. ధర్నాలు, నిరసనలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జేసీ సోదరులిద్దరిని గృహ నిర్బంధం చేశారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.