ETV Bharat / state

స్వల్పకాలిక వంగడాల వినియోగం అవశ్యం: వీసీ ప్రవీణ్ రావు - telangana latest updates

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సు ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. స్వల్పకాలిక వంగడాల వినియోగం అత్యంత అవశ్యమని వీసీ చెప్పారు. జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఇతర పరిశోధన, విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

Professor Jayashankar Agricultural University , online seminar
ఆన్​లైన్ వేదికగా సెమినార్, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీ
author img

By

Published : May 4, 2021, 8:48 AM IST

స్వల్పకాలిక వంగడాలకు భవిష్యత్తులో ఆదరణ ఉండనుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు అన్నారు. వర్సిటీ ఆవిర్భావం తర్వాత అనతికాలంలో అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో పేరుగాంచడం, పురోగతి, రైతుల కోసం నూతన వంగడాలు, వాటి ఆదరణ, వివిధ పంటలకు సంబంధించి జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో ఎదురవుతున్న సవాళ్లు, ఇతర పరిశోధన, విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సుకు ఆయన అతిథిగా హాజరయ్యారు.

పర్యావరణ పరిరక్షణ, తరిగిపోతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో స్వల్పకాలిక వంగడాల వినియోగం అత్యంత అవశ్యమని వీసీ చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినందున 80 శాతం సాగు నీటి లభ్యత పెరగడంతో వరి ఉత్పత్తిలో తెలంగాణ... దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల అవసరాలకు అనువుగా వరి పంటలో మార్పులు రావాలని ఉందని... తక్కువ గ్లైసిమికీ ఇండెక్స్, ప్రోటీన్లు తక్కువ ఉండే, బిర్యానీకి అనువైన బియ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ దిశగా పరిశోధనలు సాగాలన్నారు.

హైడెన్సిటీ వరి, యాంత్రీకరణ సాగు చేసే పత్తి రకాలు అభివృద్ధి దృష్ట్యా రూ.400 కోట్లతో వర్సిటీ మౌలిక సదుపాయాలు కల్పించిందని ప్రకటించారు. బోధన, పరిశోధన అంశాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నాయని డాక్టర్ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఇక్రిశాట్‌ అనేక అంశాల్లో ప్రొఫెసర్ జయశంకర్‌ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని రాజీవ్ వర్షిణే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇక్రిశాట్‌ జన్యు శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వర్షిణే, జాతీయ పత్తి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ వైజీ ప్రసాద్, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్‌, పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.