ETV Bharat / state

జయరాం కేసులో కీలక 'వీడియో'

జయరాం హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికొస్తోంది. ఆస్తి కోసం హత్య, బాండ్ పేపర్లపై సంతకాలు.. ఇదంతా వీడియో చిత్రీకరించి నిందితుడు మరో నేరానికి పథకం రచించాడు.

చిగురుపాటి
author img

By

Published : Feb 18, 2019, 6:15 AM IST

Updated : Feb 18, 2019, 7:40 AM IST

కేసులో కొత్త కోణం
వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హత్యకు ముందు పథకం ప్రకారం వీడియో చిత్రీకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.
undefined
ఖాళీ బాండ్‌ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుంటూ... వీడియో చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధరించారు. దీని ద్వారా భవిష్యత్తులో మరో నేరానికి పాల్పడాలనే కుట్రను పోలీసులు గుర్తించారు. వీడియో తీసినపుడు ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన నగేశ్‌, విశాల్‌ అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. వీడియో దొరికితే హత్యకు ముఖ్య ఆధారమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
వీణ పేరుతో సంక్షిప్త సందేశం పంపి జయరాంను రాకేష్ తన ఇంటికి రప్పించాడనేది తెలిసిందే. రాకేష్​తో వివాదాలున్నప్పటికీ జయరాం అక్కడికి ఎలా వెల్లాడనే కోణంలో పోలీసులు ప్రశ్నించగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి గత నెల 30న వీణ ఇంటికే తీసుకువెళ్తున్నట్లుగా రాకేష్ రెడ్డి స్నేహితులు నమ్మించారు. రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా జయరాం చివరి నిమిషంలో గుర్తించాడు.
జయరాం నుంచి డబ్బులు రాబట్టేందుకు రాకేష్ ప్రయత్నించాడు. సర్దుబాటు చేయాలని పలువురికి ఫోన్ చేయించినట్లు బయటపడింది. కోస్టల్ బ్యాంకు ఉద్యోగి దస్పల్లా హోటల్లో అప్పగించిన 6లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Intro:tg_nzb_06_17_birthday_vedukalu_av_c11
( ). మానవతా సదన్( అనాధ పిల్లల) లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్...
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్ అనాధ బాల బాలికల వసతి గృహంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొని మానవత సదన్లోని పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులతో కూర్చొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల టిఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Body:నిజామాబాదు గ్రామీణ

Conclusion:నిజామాబాద్
Last Updated : Feb 18, 2019, 7:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.