ETV Bharat / state

వీళ్ల పెళ్లి జరుగుతుంది మళ్లీ.. మళ్లీ.. మూడేళ్లకోసారి విడాకులు!!

ఓ యువతీ, యువకుడు 2016లో పెళ్లి చేసుకున్నారు.. 2019లో విడాకులు తీసుకున్నారు..! మళ్లీ వెంటనే పెళ్లి చేసుకున్నారు..!! రీసెంట్ గా జులైలో మరోసారి విడిపోయారు.. ఆ వెంటనే వివాహం చేసుకున్నారు..!! మళ్లీ 2025లో విడిపోతారు.. మళ్లీ కలుస్తారు.. ఇలా వీళ్ల పెళ్లి మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది. "ఏంటీ పిచ్చి?" అంటారా.. రండి అక్షింతలు వేస్తూ మాట్లాడుకుందాం..

pelli
pelli
author img

By

Published : Sep 22, 2022, 7:54 PM IST

Updated : Sep 22, 2022, 8:02 PM IST

ఈ వింత జంట ఉన్నది జపాన్ లో. రాజధాని టోక్యో శివారులోని హచియోజీ నగరానికి చెందిన వీరిద్దరూ.. కొన్ని నెలల డేటింగ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారికి ఓ ప్రధాన సమస్య ఎదురైంది. మన దగ్గర పెళ్లి చేసుకుంటే.. అమ్మాయి ఇంటిపేరు మారిపోతుంది. అది సర్వసాధారణం. భర్త ఇంటిపేరే భార్యకు వస్తుంది. కానీ.. జపాన్ లో ఎవరి ఇంటిపేరైనా కొనసాగించొచ్చు. అయితే.. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే ఇంటిపేరు ఉండాలి. దాన్ని చట్ట ప్రకారం రిజిస్టర్ కూడా చేయించాలి. ఇక్కడే.. ఇద్దరికీ పేచీ వచ్చింది.

నా ఇంటి పేరే ఉండాలని అబ్బాయి.. నా ఇంటి పేరే కావాలని అమ్మాయి.. ఇద్దరూ వాదించుకున్నారు. ఇద్దరూ తగ్గేదే లే అన్నారు. విషయం రెండు కుటుంబాల పెద్దల వద్దకు చేరింది. వారు సముదాయించినా.. పట్టు వీడలేదు. చిట్ట చివరకు.. మధ్యే మార్గంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే.. "మళ్లీ పెళ్లి". తొలి మూడేళ్లు ఒకరి ఇంటి పేరు ఉంటుంది. విడాకులు తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటారు. మరో మూడేళ్లపాటు ఇంకొకరి ఇంటిపేరు తగిలించుకుంటారు. ఇలా.. పెళ్లి మళ్లీ మళ్లీ అవుతూనే ఉంటుంది. ఇంటి పేర్లు షిఫ్టుల వారీగా మారిపోతూనే ఉంటాయి.

ఈ ఒప్పందానికి ఇద్దరూ సరే అన్నారు. అలా.. వాళ్లిద్దరూ 2016లో మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. మొదటి మూడేళ్లపాటు భర్త ఇంటిపేరు కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత టైమ్ వచ్చింది. దీంతో.. 2019లో విడాకులు తీసుకొని.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 2022 జూలై నాటికి మూడేళ్లు కావడంతో.. తాజాగా మరోసారి విడాకులు తీసుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు!

"ఈ తింగరి చేష్టలతో తిప్పలు రావా..?" అంటే.. మస్తు వస్తయ్. ప్రభుత్వ రికార్డుల్లో అన్నింట్లో ప్రతిసారీ మార్చాల్సి ఉంటుంది. ఇంటి పన్ను.. వాటర్ బిల్.. కరెంట్ బిల్.. ఇలా ప్రతీ దాంట్లో ఛేంజ్ చేయాలి. వాళ్లు పనిచేసే ఆఫీసుల్లోనూ మార్చుకోవాలి. ఓటర్ కార్డు.. రేషన్ కార్డు.. గ్యాస్ కనెక్షన్.. ఇలా ఎన్ని ఉంటే.. అన్ని చోట్లా మార్పించాలి. ఇందుకోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి.. ఇన్ని తిప్పలు పడడానికి కూడా సిద్ధపడ్డారు గానీ.. ఇంటిపేరు విషయంలో మాత్రం "నో కాంప్రమైజ్" అంటున్నారు.

ప్రతీ మూడేళ్లకు ఏదో ఒకదేశానికి వెళ్లి.. అక్కడ సొంత ఇంటిపేర్లతో పెళ్లి చేసుకొని.. తిరిగి స్వదేశానికి వస్తారు. మన దగ్గర కొత్త దంపతులు గుళ్లూ గోపురాలు తిరిగినట్టు.. వీరిద్దరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. వీళ్ల చావు వీళ్లు చస్తారు సరే.. పిల్లల పరిస్థితి ఏంటీ? వాళ్లకు ఎవరి ఇంటిపేరు తగిలిస్తారు? ప్రతీ మూడేళ్లకు వాళ్లది కూడా మారుస్తారా?? స్కూల్ రికార్డ్స్ ను ఎలా కొనసాగిస్తారు??? అన్నది పెద్ద డౌట్. చూశారా.. "ఇగో" ఎంత పెంట పెట్టిందో. అన్నట్టూ.. వీళ్లది లవ్ మ్యారేజ్ కదా.. మంచి అండర్ స్టాంగే ఉన్నది ఇద్దరి మధ్యా!!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

Last Updated : Sep 22, 2022, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.