ETV Bharat / state

‘వారాహి’కి లైన్‌ క్లియర్‌.. రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంతంటే..

author img

By

Published : Dec 13, 2022, 12:07 PM IST

Line Clear For Janasena Varahi Registration: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయని రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ పాపారావు పేర్కొన్నారు. మెహదీపట్నం రవాణాశాఖ కార్యాలయంలో టీఎస్‌13ఈఎక్స్‌ 8384 తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన తెలిపారు. వారాహి వాహనం తమ దగ్గరకు వచ్చినప్పుడు రవాణాశాఖ నిబంధనలకు లోబడే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

జనసేన ‘వారాహి’కి లైన్‌ క్లియర్‌.. రిజిస్ట్రేషన్‌ పూర్తి

Line Clear For Janasena Varahi Registration: వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కేటాయించాలంటూ.. పవన్‌ కల్యాణ్‌ ప్రతినిధులు రెండు వారాల క్రితం తమను సంప్రదించారని, వారి దరఖాస్తును పరిశీలించిన అనంతరం మోటార్‌ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని రవాణాశాఖ ప్రాంతీయ కమిషనర్‌ పాపారావు తెలిపారు. అది కారవాన్‌ వాహనమని, కొన్ని సౌకర్యాల కోసం దానిలో మార్పుచేర్పులు చేశామంటూ బాడీ బిల్డింగ్‌ సంస్థ ధ్రువపత్రాన్ని సమర్పించిందని వివరించారు.

వాహనం రంగు ఎమరాల్డ్‌ గ్రీన్‌ అని, వాహనానికి అన్ని పరీక్షలు చేసి సంతృప్తి చెందాకే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చామని వెల్లడించారు. ఈ వాహనంలో దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చన్నారు. యుద్ధానికి సిద్ధమంటూ పవన్‌కల్యాణ్‌ ‘వారాహి’ వాహనం ఫొటో, వీడియోలను ట్విటర్‌లో కొద్దిరోజుల క్రితం పోస్ట్‌ చేశారు. సైన్యాధికారులు, సైనిక అవసరాలకు వినియోగించే వాహనాలకు మాత్రమే ఆకుపచ్చ రంగు ఉండాలని, ఇతరులు వినియోగించకూడదంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దీనికి రిజిస్ట్రేషన్‌ చేస్తారా లేదా అనే ఉత్కంఠ ఏర్పడింది.

‘వారాహి’ని టాటా మోటార్స్‌ సంస్థ భారత్‌ స్టాండర్డ్స్‌-6 ప్రమాణాలతో తయారు చేసింది. ‘వారాహి’ రంగుపై అభ్యంతరం ఏమీ లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. భారత సైన్యం ఉపయోగించే రంగు కోడ్‌ 7బీ 8165 అని, జనసేన ప్రచార వాహనం రంగు కోడ్‌ 445సీ44 అని మంత్రి వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.