ETV Bharat / state

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో జనసేన - 8 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన - JanaSena Contest in Telangana Elections

Janasena MLA Candidates List in Telangana 2023 : శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ ఎన్నికలో జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

janasena released mla candidates list
janasena released mla candidates list
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 9:22 AM IST

Janasena MLA Candidates List in Telangana 2023 : తెలంగాణలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీలు ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నాయి. సభలు, సమావేశాలతో ఎన్నికల కదనరంగలోకి దూకాయి. వివిధ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్​ కోసం కొందరు, మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరోవైపు తమ వెంట కలిసివచ్చే పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటున్నాయి. తాజాగా ఈ ఎన్నికల్లో జనసేన.. బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన.. అభ్యర్థులను (Janasena MLA Candidates List) ప్రకటించింది. ఈ మేరకు ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను జనసేన మంగళవారం విడుదల చేసింది.

నియోజవర్గం - అభ్యర్థి పేరు

  • కూకట్‌పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌
  • కొత్తగూడేం - లక్కినేని సురేందర్‌రావు
  • వైరా(ఎస్టీ) - తేజావత్‌ సంపత్‌నాయక్‌
  • అశ్వారావుపేట(ఎస్టీ) -ముయబోయిన ఉమాదేవి
  • తాండూరు - వేమూరి శంకర్‌గౌడ్‌
  • కోదాడ - మేకల సతీశ్‌రెడ్డి
  • నాగర్‌కర్నూల్‌ - వంగ లక్ష్మణ్‌గౌడ్‌
  • ఖమ్మం- మిర్యాల రామకృష్ణ

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

BJP Janasena Alliance in Telangana 2023 : మరోవైపు ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈలోపు తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని చర్చించేందుకు ఇరు పార్టీ నేతలు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్​ షాను కలవగా.. రెండు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లాలని ఆయన సూచించారు. సీట్ల విషయంలో అవగాహనకు రావాలని ఇరు పార్టీల నాయకులకు చెప్పారు.

BJP Janasena Alliance Issue 2023 : జనసేనతో బీజేపీ పొత్తు.. కాషాయ నేతలకు తలనొప్పి తెస్తోందిగా..?

Janasena Telangana MLA Candidates List 2023 : అయితే మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని జనసేన నేతలు తెలిపారు. అనంతరం బీజేపీతో పొత్తు దృష్ట్యా.. 11 చోట్ల పోటీ చేయాలని జనసేన నిర్ణయించినా.. తాజాగా జరిగిన చర్చల ఫలితంగా 9 స్థానాలకు ఆ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. కానీ తాజాగా 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఈ శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి.

మరోవైపు తెలంగాణ ఎన్నికలకు బీజేపీ నాలుగో అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు నాలుగు జాబితాల్లో 100 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా జనసేన అభ్యర్థుల ప్రకటనతో.. మిగిలిన స్థానాల విషయంలో బీజేపీ కసరత్తు చేస్తోంది.

BJP Leaders Election Campaign in Telangana : బీజేపీ ఎన్నికల ప్రచార జోరు.. బీసీ సీఎం నినాదంతో ముందుకు..

BJP Telangana Assembly Elections Strategy 2023 : బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు​.. RSS నేతలతో కలిసి ప్రచారంపై ప్రణాళికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.