మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నేర్చుకుని విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. తాము చెప్పే చదువనేది... విద్యార్థులు నిరంతరం నేర్చుకునే దృక్పథాన్ని కలిగించేలా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. హైదరాబాద్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కేబి పాఠశాలలో 47వ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శన 2019ను ప్రారంభించారు.
శాస్త్రం పట్ల శాస్త్రీయ అవగాహన పెంచడం కోసం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని జనార్దన్‌రెడ్డి తెలిపారు. శాఖల వారీగా పాఠశాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి విద్యార్థులను విజ్ఞానవంతులుగా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: రివ్యూ 2019: గత ఐదేళ్లలో ఈసారే తక్కువ ఐపీఓలు