ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యంలో జానపద కళలకు వేదికైంది హైదరాబాద్లోని రవీంద్ర భారతి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన జానపద జాతరకు కళాకారులు భారీగా హాజరై.... తమ ఆట పాటలతో అలరించారు. సంప్రదాయ జనపదాలను కాపాడే లక్ష్యంతో.. ప్రభుత్వం ఏటా ఈ జాతరను నిర్వహిస్తోంది.
400 మంది కళాకారులు
సుమారు 400 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయ కళలు అయిన గుస్సాడీ, ఒగ్గుడోళ్లు, కోలాటం, డప్పు విన్యాసాలు, చెక్క భజన అలరించాయి. ముఖ్యంగా హరికథ, బుర్రకథ, యక్షగాన కళాకారులను చూసి యువత సంబరపడింది. ఇక్కడ చెక్క బొమ్మల ఆటలు, వీరభద్ర ప్రభలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు కళలను నమ్ముకున్న తమకు రోజు గడిచేది కాదని.. ఇప్పుడు తెలంగాణ సర్కారు వచ్చాకా... తమ బతుకులు కొంత వరకు బాగుపడ్డాయని వారు చెబుతున్నారు.
కళాకారులకు ఉపాధి
అంతరించి పోతున్న కళలను బతికించే ఉద్దేశంతో సర్కారు చేపట్టిన ఈ ఉత్సవాలకు విశేష ఆదరణ లభించింది. భవిష్యత్తులోనూ మరిన్ని సరికొత్త కార్యక్రమాలతో కళాకారులకు ఉపాధి కల్పిస్తామని సాంస్కృతిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!