తెలంగాణ అంటే జానపదాలకు పుట్టినిల్లు అని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. అంతరించి పోతున్న జానపద కళలను, కళాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రవీంద్రభారతిలో నవకళా వైభవమ్ పేరిట ఏర్పాటు చేసిన జానపద కళల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ జానపద కళారూపాలతో పాటు జానపద గేయాలతో గాయనీ గాయకులు అలరించారు.
ఇదీ చూడండి : నిపా వైరస్... నిర్లక్ష్యంతోనే ముప్పు!