రంజాన్ మాసంలో చేసే తరావి నమాజ్.. ఇళ్లల్లోనే చేసుకోవాలని జామియా నిజామియా వీసీ మౌలానా ముఫ్తి ఖలీల్ అహ్మద్ ముస్లింలను కోరారు. ఈ నెలలో రంజాన్ మాసం ప్రారంభం కానునున్నందున ఆయన విజ్ఞప్తి చేశారు. రోజువారీ, శుక్రవారం నమాజ్‌లు ఇళ్లలోనే చేసుకుంటుండగా.. రంజాన్ మాసం తరావి నమాజ్ కూడా తమ తమ ఇళ్లలో చేసుకోవాలని కోరారు. ప్రజలు ఒకే చోట గుమిగూడటం వల్ల కరోనా ప్రబలుతుందని.. అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!