భాగ్యనగరంలో నేడు నీటి పారుదలతో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరగనున్న సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు.
సీఎం దిశానిర్దేశంతో..
తమిళనాడులో తాగునీటి సమస్యపై, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై చర్చించే అవకాశాలున్నాయి. సదస్సు నేపథ్యంలో సీఎస్ ఎస్కే జోషి, నీటిపారుదల ఈఎన్సీ మరళీధర్తో సమావేశమైన సీఎం కేసీఆర్.. రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండిః జలశక్తి అభియాన్లో మహబూబ్నగర్దే మొదటి స్థానం